
AP News: గూడ్స్‌పైకి ఎక్కి సెల్ఫీకి దుస్సాహసం..యువకుడికి తీవ్రగాయాలు
పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: గూడ్సు రైలెక్కి సెల్ఫీ తీసుకునే మోజులో విద్యుత్తు తీగలు తగిలి ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన కటకంశెట్టి సైదారావు కుమారుడు వీరబ్రహ్మం ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం రైల్వేస్టేషన్ పరిసరాల్లోకి బైక్‌పై వెళ్లాడు. నడికూడి నుంచి చెన్నై వెళ్లే గూడ్స్ రైలు ప్లాట్‌ఫాంపై ఆగి ఉండగా వీరబ్రహ్మం గార్డు ఉండే బోగీపైకి ఎక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కొద్ది ఎత్తులోనే ఉన్న విద్యుత్తు తీగలు తగిలి కిందపడిపోయాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన సమీపంలోని గొర్రెల కాపరి వచ్చి మంటలార్పి దుస్తులు తొలగించాడు. రైల్వే పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.