Karvy: కార్వీ కుంభకోణంలో తోడుదొంగలు

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌(కేఎస్‌బీఎల్‌) కుంభకోణంలో సంస్థ సీఎండీ కొమండూరు పార్థసారథితోపాటు సీఎఫ్‌వో కృష్ణహరి కీలక సూత్రధారులని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నిర్ధారణకు వచ్చింది. షేర్‌హోల్డర్లకు

Updated : 28 Jan 2022 07:05 IST

సీఎండీ, సీఎఫ్‌ఓలే ప్రధాన కుట్రదారులు
రూ.2,873 కోట్ల మోసంలో దర్యాప్తు ముమ్మరం

ఈనాడు, హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌(కేఎస్‌బీఎల్‌) కుంభకోణంలో సంస్థ సీఎండీ కొమండూరు పార్థసారథితోపాటు సీఎఫ్‌వో కృష్ణహరి కీలక సూత్రధారులని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నిర్ధారణకు వచ్చింది. షేర్‌హోల్డర్లకు తెలియకుండా వారి షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందడం, డొల్ల కంపెనీల ద్వారా ఆ నిధుల్ని మళ్లించడం అంతా వీరిద్దరి ఆదేశాలతోనే జరిగినట్లు వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా గురువారం వీరిద్దరినీ ఈడీ అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ నెల 30 వరకు వీరిని విచారించనున్నారు. ఈడీ ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు నిందితులు తమ ఖాతాదారుల షేర్లకు సంబంధించి రూ.2,873.82 కోట్లను అక్రమంగా మళ్లించారు. ఇందుకోసం కేఎస్‌బీఎల్‌ 14 డొల్ల కంపెనీలను సృష్టించారు. షేర్లను తనఖా పెట్టి పొందిన రుణంలో రూ.400 కోట్లను పాత బకాయిలు చెల్లించేందుకు వినియోగించినట్లు ఈడీ గుర్తించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని