తహసీల్దార్‌పై వైకాపా సర్పంచి దాడి

మండల సమావేశానికి ఆలస్యంగా వచ్చారంటూ ఏకంగా తహసీల్దార్‌ పైనే ఓ సర్పంచి దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 29 Jan 2022 04:34 IST

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: మండల సమావేశానికి ఆలస్యంగా వచ్చారంటూ ఏకంగా తహసీల్దార్‌ పైనే ఓ సర్పంచి దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో శుక్రవారం చోటుచేసుకుంది. సర్వసభ్య సమావేశానికి అధికారులే ఆలస్యంగా వస్తే ప్రజాప్రతినిధులకు సమాధానం ఎవరు చెబుతారంటూ తహసీల్దార్‌ నాగార్జునరెడ్డిపై దాసరిపల్లి సర్పంచి భవనం కృష్ణారెడ్డి దాడి చేశారు. తహసీల్దార్‌ను దుర్భాషలాడుతూ సర్పంచి చేయిచేసుకున్నాడు. తహసీల్దారు సమావేశ భవనంలో కిందపడిపోయారు. దీంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కొందరు సభ్యులు జోక్యం చేసుకొని సర్పంచిని శాంతింపజేశారు. ఈ విషయమై తహసీల్దార్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. తాను కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌లో ఉన్నందువల్ల ఆర్‌ఐని సమావేశానికి పంపానని చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సమావేశానికి హాజరు కాగా తనపై దాసరిపల్లి సర్పంచి దౌర్జన్యం చేసి దాడికి దిగారన్నారు. గతంలో కూడా తన కార్యాలయానికి వచ్చి ఇదే తీరుగా వ్యవహరించారని, కొన్ని ఫైళ్లపై బలవంతంగా సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. దాడి విషయాన్ని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని