Updated : 31 Jan 2022 07:17 IST

తన కుమారుడు, మొదటి భర్త కుమారుడితో కలిసి భర్తనుహత్య చేయించిన భార్య

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: తన మెడలో తాళి కట్టి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్న భర్తను భార్య సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన ఉదంతమిది. నిర్మల్‌ డీఎస్పీ ఉపేంద్రారెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుచానూరు ప్రాంతానికి చెందిన కంచికట్ల శ్రీనివాస్‌(42) అనాథ. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. తొలుత ఆటో నడిపేవాడు. ఆ క్రమంలో ఉప్పల్‌ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసే జగిత్యాల జిల్లా మెట్‌పెల్లి మండలం వేంపేట్‌కు చెందిన స్వప్నతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. స్వప్నకు ఇదివరకే వివాహమై.. ఒక కుమారుడు(రాజ్‌కుమార్‌) జన్మించాక విడాకులు తీసుకుంది. శ్రీనివాస్‌, స్వప్నల దంపతులకు ఒక కుమారుడు(తరుణ్‌), కుమార్తె జన్మించారు. స్నేహితుల సాయంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి శ్రీనివాస్‌ అడుగుపెట్టాడు. ఉప్పల్‌, వేంపేట్‌లలో ఇళ్లు నిర్మించాడు. ఈ క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఆమెతో పాటు కలిసి ఉందామంటూ భార్యను వేధించసాగాడు. అతన్ని చంపేస్తేనే సమస్య పరిష్కారమవుతుందని స్వప్న భావించింది. ఇటీవల కుటుంబసభ్యులంతా వేంపేటకు వచ్చారు. ఇదే అదనుగా భావించిన స్వప్న తరుణ్‌, రాజ్‌కుమార్‌లతోపాటు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌కు చెందిన తన అక్క కుమారుడు పోశెట్టిలతో కలిసి శ్రీనివాస్‌ను చంపాలనుకున్నట్లు చెప్పింది. సుపారీ గ్యాంగ్‌తో చేయిద్దామంటూ పోశెట్టి తన తమ్ముడు చిక్కా అలియాస్‌ ప్రవీణ్‌కుమార్‌ను వేంపేట్‌కు పిలిపించాడు. ఈ నెల 22న రాత్రి మెదక్‌, జగిత్యాల జిల్లాలకు చెందిన బాణాల అనిల్‌, కంచర్ల మహవీర్‌, మ్యాతరి మధు, కొలనురి సునీల్‌, పొన్నం శ్రీకాంత్‌, పూసల రాజేందర్‌లతో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోతున్న శ్రీనివాస్‌పై రోకలిబండతో దాడి చేసి హత్య చేశారు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని వారు వెళ్లిపోయారు. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌ సమీపంలోని వాగులో మృతదేహాన్ని పోశెట్టి, రాజ్‌కుమార్‌, చిక్కాలు పడేశారు. ఈ కేసును ఛేదించిన లక్ష్మణచాంద పోలీసులు మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. 10 మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 73 గ్రాముల బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన రోకలి బండ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని