Telangana News: ఇది ఉద్యోగమా? బానిస బతుకా సార్‌!

‘అన్ని విషయాల్లో మమ్ములను బలిపశువులను చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబీకులం. పంచాయతీకి పెట్టుబడి ఎక్కడి నుంచి తేగలం? ట్రాక్టర్‌కు డీజిల్‌ కూడా మేమే పోయించాలి. సర్పంచికి బాధ్యత లేదా? ఇది ఉద్యోగమా..

Updated : 05 Feb 2022 08:02 IST

లేఖ రాసి పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

బయ్యారం, న్యూస్‌టుడే: ‘అన్ని విషయాల్లో మమ్ములను బలిపశువులను చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబీకులం. పంచాయతీకి పెట్టుబడి ఎక్కడి నుంచి తేగలం? ట్రాక్టర్‌కు డీజిల్‌ కూడా మేమే పోయించాలి. సర్పంచికి బాధ్యత లేదా? ఇది ఉద్యోగమా..బానిస బతుకా సార్‌? కార్యదర్శుల పని తీరువల్లే అనేక విషయాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. అయినా మాకు గుర్తింపు లేదు. కష్టపడి ఉన్నత చదువులు చదివితే ఏదో ఒక ఉద్యోగం వచ్చిందనుకుంటే చదువురాని కొందరి తీరుతో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి’’ అని లేఖ రాసి ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు యత్నించారు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం పాత ఇర్సులాపురానికి చెందిన వెంకటేశ్‌ నారాయణపురం పంచాయతీ కార్యదర్శిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు. సర్పంచి, ఉపసర్పంచి సహకరించడం లేదంటూ జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ పేరిట లేఖ రాసి శుక్రవారం ఇంట్లో పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్‌ శశాంక, బయ్యారం ఎంపీడీవో చలపతిరావు, మరికొందరు అధికారులు ఆసుపత్రిలో వెంకటేశ్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంకటేశ్‌ను హైదరాబాద్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు