Andhra News: అనంత జేఎన్‌టీయూలో ర్యాగింగ్‌.. జూనియర్లను వేధించిన 18 మంది సస్పెన్షన్‌

అనంతపురం జేఎన్‌టీయూలో జూనియర్లను సీనియర్లు వేధించినట్లు తేలింది. విచారణాధికారుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి ఇద్దరు విద్యార్థులను సీనియర్లు గురుకులం వసతిగృహంలోని తమ గదులకు తీసుకెళ్లారు. వారిని

Updated : 07 Feb 2022 09:15 IST

అనంతపురం, న్యూస్‌టుడే: అనంతపురం జేఎన్‌టీయూలో జూనియర్లను సీనియర్లు వేధించినట్లు తేలింది. విచారణాధికారుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి ఇద్దరు విద్యార్థులను సీనియర్లు గురుకులం వసతిగృహంలోని తమ గదులకు తీసుకెళ్లారు. వారిని అర్ధనగ్నంగా నిలబెట్టి, చెప్పిన పనిచేయాలని భయపెట్టినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో 18 మంది సీనియర్లను కళాశాల నుంచి సస్పెండ్‌ చేశామని ప్రిన్సిపల్‌ సుజాత తెలిపారు. వర్సిటీలో ఉన్నతాధికారులు, పోలీసులు, వసతిగృహాల వార్డెన్లతో కలిపి ఏర్పాటైన ర్యాగింగ్‌ నిరోధక కమిటీ ఈ ఏడాది ఒక్క అవగాహన సదస్సు కూడా నిర్వహించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని