సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. 50రోజులు మృత్యువుతో పోరాడి!

తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ కొనివ్వకపోవడంతో ఆన్‌లైన్‌ పాఠాలు వినలేకపోతున్నానని ఆవేదనకు గురై క్రిమిసంహారక మందు తాగిన ఓ విద్యార్థి అసువులు బాశాడు. పోలీసులు తెలిపిన

Updated : 09 Feb 2022 09:54 IST

50 రోజులుగా చికిత్స పొందుతూ మృతి

నకిరేకల్‌, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ కొనివ్వకపోవడంతో ఆన్‌లైన్‌ పాఠాలు వినలేకపోతున్నానని ఆవేదనకు గురై క్రిమిసంహారక మందు తాగిన ఓ విద్యార్థి అసువులు బాశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి(13) ఆన్‌లైన్‌ తరగతుల కోసం సెల్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఆర్థిక కారణాలతో వారు వాయిదా వేస్తుండటం, ఆన్‌లైన్‌ తరగతులను వినలేకపోతున్నాననే మనస్తాపంతో డిసెంబరు 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స కోసం అతడిని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిమ్స్‌లో చేర్పించారు. సుమారు 50 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన విద్యార్థి సోమవారం రాత్రి కన్నుమూశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని