నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు
మావోయిస్టు కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నెల్లూరులో
మావోయిస్టులకు నిధుల కేసు.. గుత్తేదారు ఇంట్లో తనిఖీలు
ఈనాడు-అమరావతి, నెల్లూరు నేర విభాగం-న్యూస్‌టుడే: మావోయిస్టు కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నెల్లూరులో శనివారం సోదాలు నిర్వహించారు. చిన్నపిల్లల పార్కు వద్ద రాంజీనగర్‌లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్న ప్రముఖ గుత్తేదారు పెంచలనాయుడు ఇంట్లో తనిఖీలు జరిగాయి. శనివారం తెల్లవారుజామునే ఎన్ఐఏ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో పెంచలనాయుడు లేకపోవటంతో కుటుంబసభ్యులకు వివరాలు తెలియజేసి మూడు గంటల పాటు సోదాలు చేశారు. పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో దేశవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు శనివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బిహార్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు చేశారు. సోదాల్లో మూడు నాటు తుపాకులు, పాయింట్ 315 బోర్ రైఫిల్స్, 59 తుపాకీ గుండ్లు, కొన్ని డిజిటల్ పరికరాలు, సాహిత్యం, పత్రాలు, 4 కిలోల అనుమానిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. గతేడాది ఎన్ఐఏ రాంచీ విభాగం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. మావోయిస్టులు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చుకునేందుకు, కొత్త నియామకాలు చేపట్టేందుకు, బలోపేతమయ్యేందుకు వారికి అవసరమైన నిధులను కొందరు సమకూరుస్తున్నారన్న ఆరోపణలపై అప్పట్లో కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత