Andhra News: ప్రియురాలి రెండేళ్ల కుమార్తెకు చిత్రహింసలు

అభం.. శుభం తెలియని ఆ చిన్నారి ముద్దులొలికే పలుకులు వింటే ఎవరైనా పరవశించాలి.. చిట్టి పాదాలు సవ్వడి చేస్తే.. మురిపెంగా మురిసిపోవాలి. కానీ.. ఈ కర్కశుడి మృగత్వం పెచ్చరిల్లిందనే చెప్పాలి. తన ప్రియురాలి కుమార్తె, రెండేళ్ల బాలికను

Updated : 18 Feb 2022 07:09 IST

విజయనగరం నేరవార్తా విభాగం, పార్వతీపురం, న్యూస్‌టుడే: అభం.. శుభం తెలియని ఆ చిన్నారి ముద్దులొలికే పలుకులు వింటే ఎవరైనా పరవశించాలి.. చిట్టి పాదాలు సవ్వడి చేస్తే.. మురిపెంగా మురిసిపోవాలి. కానీ.. ఈ కర్కశుడి మృగత్వం పెచ్చరిల్లిందనే చెప్పాలి. తన ప్రియురాలి కుమార్తె, రెండేళ్ల బాలికను ఏడు నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తున్న ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం కొత్తపేట సమీపంలో ఉంటున్న 26 ఏళ్ల వివాహితను భర్త వదిలేశాడు. ఆమెకు రెండేళ్ల చిన్నారి ఉంది. కూలి పనులు చేసుకుని జీవిస్తున్న ఆమెకు నెల్లిమర్లలో ఓ శుభకార్యంలో ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ చిన్నా(29) పరిచయమయ్యాడు. అది సహజీవనానికి దారితీసింది. ఇద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఏడు నెలలుగా బాలికను కొట్టడం, రక్కడం వంటి వికృత చేష్టలకు చిన్నా పాల్పడుతున్నా ఆమె అడ్డుచెప్పలేదు. బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేనప్పుడు పాప బుగ్గలు, చేతులు, కాళ్లను చిన్నా కొరికేశాడు. ఆమె ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుండటంతో చుట్టుపక్కల ఏమైందని అడిగితే విషయాన్ని దాటవేసింది. అంగన్‌వాడీ సిబ్బందికి విషయం తెలియడంతో స్థానిక మహిళా సంరక్షణ పోలీసుకు సమాచారమిచ్చారు. తల్లి ఫిర్యాదు మేరకు చిన్నాను రిమాండుకు తరలించామని దిశ డీఎస్పీ టి.త్రినాథ్‌ తెలిపారు. బాలికను వైద్యచికిత్సలకు ఆసుపత్రికి తరలించామని, తల్లికి వ్యక్తిత్వ, మానసిక నిపుణుల వద్ద కౌన్సెలింగ్‌ చేయిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని