Crime News: కుమార్తెను చంపి... మృతదేహంపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌ గునా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్న కుమార్తె(14)ను హత్య చేసిన ఓ తండ్రి అంతటితో ఆగక ఆమె మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను అడవిలోకి తీసుకెళ్లి ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

Updated : 24 Feb 2022 07:02 IST

ధ్యప్రదేశ్‌ గునా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్న కుమార్తె(14)ను హత్య చేసిన ఓ తండ్రి అంతటితో ఆగక ఆమె మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను అడవిలోకి తీసుకెళ్లి ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అఘాయిత్యం చేసిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు తన కుమార్తె తప్పిపోయిందని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక బంధువులను, ఇరుగుపొరుగు వారిని విచారించారు. బాలిక చివరగా తండ్రితోనే కనిపించిందని అందరూ చెప్పారు. పోలీసులకు అనుమానం వచ్చి నిందితుడ్ని తమదైన శైలిలో విచారించగా.. నిజం అంగీకరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని