Crime News: ప్రాణం తీసిన కోడికూర వివాదం.. చెల్లిని చంపిన అన్న

కోడికూర వండలేదని సోదరుడే చెల్లిని చంపిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కన్నాపురంలో చోటుచేసుకుంది. సీఐ గజేంద్రకుమార్‌ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద

Updated : 05 Mar 2022 08:11 IST

కూనవరం, న్యూస్‌టుడే: కోడికూర వండలేదని సోదరుడే చెల్లిని చంపిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కన్నాపురంలో చోటుచేసుకుంది. సీఐ గజేంద్రకుమార్‌ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయన్ను చూసేందుకు తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో నివసిస్తున్న చెల్లెలు సోమమ్మ(20) వారం కిందటే కన్నాపురం వచ్చారు. రెండురోజుల్లో వస్తానని నంద భార్య పుట్టింటికి వెళ్లారు. నంద గురువారం రాత్రి పదింటికి మద్యం మత్తులో కోడిమాంసం ఇంటికి తీసుకొచ్చాడు. కోడి కూర చేయమనగా, సోమమ్మ నీరసంగా ఉందని చెప్పడంతో గొడవకు దిగాడు. ఇంటికొచ్చేసరికి వండాలని చెప్పి అతడు బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన నంద కోడికూర వడ్డించాలని కోరగా.... ఆమె వండలేదని చెప్పడంతో దాడికి యత్నించాడు. ఆమె అరుస్తూ బయటకు పరిగెడుతుండగా వెంటాడి గొడ్డలితో నరికాడు. ఆమె కేకలకు చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకునే సరికి సోమమ్మ రక్తపుమడుగులో కొట్టుకుంటూ ప్రాణాలొదిలింది. అతణ్ని గ్రామస్థులు చెట్టుకు కట్టేశారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని