జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నా..

జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాని పేర్కొంటూ ఇంటర్‌ విద్యార్థిని ఒకరు తాను చదువుతున్న గురుకులంలోనే బలవన్మరణానికి పాల్పడింది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్‌ సవిత తెలిపిన వివరాలు.. నిజాంసాగర్‌ మండలానికి

Published : 05 Mar 2022 06:31 IST

గుర్తింపు లేదనే నిరాశతో గురుకుల ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

మద్నూర్‌, న్యూస్‌టుడే: జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాని పేర్కొంటూ ఇంటర్‌ విద్యార్థిని ఒకరు తాను చదువుతున్న గురుకులంలోనే బలవన్మరణానికి పాల్పడింది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్‌ సవిత తెలిపిన వివరాలు.. నిజాంసాగర్‌ మండలానికి చెందిన విద్యార్థిని కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం పెద్దఎక్లార గేట్‌ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం (సీఈసీ) చదువుతోంది. శుక్రవారం ఉదయం నుంచి కనిపించడంలేదని తోటి విద్యార్థులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లేకపోవడంతో అనుమానం వచ్చి విద్యార్థిని పుస్తకాలను పరిశీలించారు. అందులో ఉన్న లేఖను పరిశీలించగా... ‘నాకు బతకాలని లేదు.. నేను జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాను.. తగిన గుర్తింపు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని రాసి ఉంది. అనంతరం పాఠశాల ఆవరణలోని నీళ్ల ట్యాంకును పరిశీలించగా అందులో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు, విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని