Telangana News: వనమా రాఘవకు హైకోర్టు బెయిల్
తెరాస ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవకు గురువారం హైకోర్టు షరతులతో బెయిలు మంజూరు చేసింది. ఆయన వేధింపులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో 61 రోజులుగా జైలులో ఉన్న రాఘవ..
ఈనాడు, హైదరాబాద్: తెరాస ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవకు గురువారం హైకోర్టు షరతులతో బెయిలు మంజూరు చేసింది. ఆయన వేధింపులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో 61 రోజులుగా జైలులో ఉన్న రాఘవ.. పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేసిన నేపథ్యంలో బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బెయిలు మంజూరు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోకి ప్రవేశించరాదని, ప్రతి శనివారం ఖమ్మం పోలీసు స్టేషన్లో హాజరవ్వాలని, సాక్షులను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం వంటివి చేయరాదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్