ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కమాండర్‌ మృతి

మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు కమాండర్‌ మృతి చెందగా ఒక జవాను గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా కైకా-మౌస్లా అటవీ ప్రాంతంలో

Published : 12 Mar 2022 04:57 IST

జవానుకు గాయాలు.. ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు కమాండర్‌ మృతి చెందగా ఒక జవాను గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా కైకా-మౌస్లా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలు ఉన్నట్లు నిఘా విభాగాల ద్వారా సమాచారం అందడంతో డీఆర్జీ (డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డు) బలగాలు శుక్రవారం ఉదయం కూంబింగ్‌ చేపట్టాయి. తారసపడిన కొంతమంది మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు నేషనల్‌ పార్క్‌ ఏరియా కమిటీ సభ్యుడు, సాండ్రా ఎల్‌వోఎస్‌(లోకల్‌ ఆర్గనైజేషన్‌ స్క్వాడ్‌) డిప్యూటీ కమాండర్‌ రితేష్‌ పూనెం(35) మృతి చెందారు. డీఆర్జీ జవాను రామ్లూ హేమ్లా కాలికి బుల్లెట్‌ తగలడంతో గాయమైంది. వెంటనే భద్రతా బలగాలు చికిత్స కోసం ఆయన్ను జిల్లా ఆసుపత్రికి తరలించాయి. ఘటనా స్థలంలో పూనెం మృతదేహంతో పాటు తుపాకీ, కిట్‌ బ్యాగ్‌లు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గతంలో రితేష్‌పై రూ.3 లక్షల రివార్డు ప్రకటించి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు