Published : 24 Mar 2022 07:12 IST

నమ్మించి కారు ఎక్కించుకుని తోటి ఉపాధ్యాయురాలిపై అత్యాచారం

ఖమ్మం అర్బన్‌, న్యూస్‌టుడే: చంపుతానంటూ బెదిరించి తోటి ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి పాల్పడిన కీచక ఉపాధ్యాయునిపై ఖమ్మం ఖానాపురంహవేలి పోలీసుస్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం... మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం పాఠశాలలో బాణోతు కిశోర్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన ఓ సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలే. ఖమ్మంలో నివసించే వారు ఇద్దరూ కారులో పాఠశాలకు వెళ్లివస్తుంటారు. అదే మండలంలో పనిచేస్తూ ఖమ్మంలో నివసించే ఓ ఉపాధ్యాయురాలు నిత్యం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ వరకు ప్యాసింజర్‌ రైలులో, అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నారు. ఈనెల 16 నుంచి పాఠశాలలు ఒంటిపూట నిర్వహిస్తున్నారు. 17న ఇంటికి తిరిగి వచ్చేందుకు రైల్వేస్టేషనులో వేచి ఉన్న సదరు మహిళా ఉపాధ్యాయురాలిని తన భార్య కూడా వస్తోందని నమ్మించి కారు ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెను చంపుతానని బెదిరించి సెల్‌ఫోన్‌ లాక్కున్నాడు. మార్గమధ్యలో పాండురంగాపురంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఆమె భర్తను, పిల్లలను చంపుతానని బెదిరించాడు. దీంతో విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే తీవ్రంగా మధనపడిన ఆమె మంగళవారం తన భర్తకు విషయం తెలిపారు. భర్తతో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు కిశోర్‌ పరారీలో ఉన్నాడని సీఐ వివరించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని