Andhra News: ఏపీ నిట్‌లో ర్యాగింగ్‌

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌ ప్రాంగణంలో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. జూనియర్‌ విద్యార్థిపై తొమ్మిది మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేయడంపై పట్టణ పోలీసుస్టేషన్‌లో

Updated : 25 Mar 2022 06:52 IST

జూనియర్‌ విద్యార్థిని నిర్బంధించి దాడి

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌ ప్రాంగణంలో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. జూనియర్‌ విద్యార్థిపై తొమ్మిది మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేయడంపై పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ ఆకుల రఘు కథనం ప్రకారం.. జూనియర్‌ విద్యార్థిని మూడు నెలలుగా కొందరు సీనియర్లు ర్యాగింగ్‌ చేస్తున్నారు.

ఆవేదన చెందిన జూనియర్‌.. సీనియర్ల ఫోన్‌ నంబర్లకు నంబరు తెలియకుండా ఉండే ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. దీనిని గుర్తించిన సీనియర్లు బుధవారం రాత్రి 11 గంటలకు అతన్ని వసతి గృహం గదికి తీసుకొచ్చి మోకాళ్లపై నిలబెట్టి తీవ్రంగా గాయపరిచారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొడుతూనే ఉన్నట్లు గురువారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. అంతకుముందు నిట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని