Updated : 27 Mar 2022 08:15 IST

Crime News: ప్రేమికుడి కళ్లెదుటే యువతిపై అత్యాచారం

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

వేలచ్చేరి, న్యూస్‌టుడే: తన కళ్ల ముందే ప్రేయసిపై అత్యాచారం జరగడంతో ఆవేదన చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోట ప్రాంతానికి చెందిన యువతి, ఆమె ప్రియుడు కలిసి ఈనెల 23న సముద్ర తీరానికి వెళ్లారు. బీచ్‌లో కూర్చుని మాట్లాడుకుంటుండగా అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. యువకుడిపై దాడి చేసి అతడి కళ్ల ఎదుటే యువతిపై అత్యాచారం చేసి ఆమె మెడలోని నగలను దోచుకుని పారిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రియుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించారు. నిందితులు పద్మాశ్వరన్‌, దినేష్‌ కుమార్‌, అజిత్‌లను అరెస్టు చేయడానికి వెళ్లగా వారు పోలీసులపై దాడి చేసి పారిపోయారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని