Telangana News: గంజాయి తరలిస్తూ పట్టుబడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా రాంనగర్‌

Updated : 28 Mar 2022 06:45 IST

మరొకర్నీ అరెస్టు చేసిన పోలీసులు

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా రాంనగర్‌ ఠాణా పోలీసులు శనివారం చిచ్పల్లి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. మంథని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాచిడి శ్రీనివాస్‌గౌడ్‌, గంట శంకర్‌ రెండు వేర్వేరు కార్లలో గంజాయి తరలిస్తూ ఈ తనిఖీల్లో పట్టుబడ్డారు. రెండు వాహనాల్లో రూ.32 లక్షల విలువైన 103.83 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయి, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. శ్రీనివాస్‌గౌడ్‌ మంథనిలోని బెస్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతని మామ తెరాస మండలస్థాయి నేత. శంకర్‌ గతంలో శ్రీనివాస్‌గౌడ్‌ మామ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆంగ్ల బోధన శిక్షణ తరగతులకు శ్రీనివాస్‌గౌడ్‌ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్య కారణాలతో సెలవు తీసుకున్నాడని ఎంఈవో లక్ష్మి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని