Telangana News: విషం ఇంజక్షన్లతో వందకు పైగా కుక్కల మృతి
మూగజీవాల పట్ల విశ్వాస ఘాతుకమిది. విషం ఇంజక్షన్లు ఇవ్వడంతో వందకు పైగా కుక్కలు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుడొకరు తన పెంపుడు కుక్క చనిపోవడంతో హైదరాబాద్‌లోని
సిద్దిపేట జిల్లా తీగుల్ గ్రామంలో ఘటన
సర్పంచి, కార్యదర్శి చేయించారని స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు
జగదేవపూర్, న్యూస్‌టుడే: మూగజీవాల పట్ల విశ్వాస ఘాతుకమిది. విషం ఇంజక్షన్లు ఇవ్వడంతో వందకు పైగా కుక్కలు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుడొకరు తన పెంపుడు కుక్క చనిపోవడంతో హైదరాబాద్‌లోని స్టే యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు తెలిపారు. సంస్థ సభ్యులు ఆదివారం రాత్రి గ్రామానికి వచ్చి విచారించగా అసలు విషయం వెల్లడైంది. సంస్థ ప్రతినిధులు శశికళ, గౌతం పలు వివరాలను విలేకరులకు వెల్లడించారు. కుక్కల బెడదపై గ్రామస్థులు పలుమార్లు పంచాయతీకి ఫిర్యాదులు చేయడంతో సర్పంచి కప్పర భానుప్రకాష్‌రావు, పంచాయతీ కార్యదర్శి రాజ్‌గోపాల్ ఇద్దరూ కలసి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇప్పించారన్నారు. విషం వల్ల వందకుపైగా శునకాలు చనిపోయాయని, వాటి కళేబరాలను గ్రామ పరిసరాల్లోని పాత బావుల్లో వేసి పూడ్చేశారని తెలిపారు. ఈ విషయంపై జగదేవపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు స్పందించలేదన్నారు. దీన్ని వారు జాతీయ జంతు సంరక్షణ సంస్థ ప్రతినిధి మేనకాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తీగుల్‌లో కుక్కలకు విషం ఇంజక్షన్లు ఇచ్చి చంపినట్లు ఫిర్యాదు రాగా సర్పంచి, కార్యదర్శిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం