Updated : 09 Apr 2022 06:43 IST

Crime News: సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దోపిడీ

సిగ్నల్‌ తీగలు కత్తిరించి ఘాతుకం 

గుత్తి, న్యూస్‌టుడే: తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైల్లో శుక్రవారం అర్దరాత్రి దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు పథకం ప్రకారం రైలును ఆపి దోపిడీకి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో దుండగులు సిగ్నల్‌ తీగలను కత్తిరించారు. దీంతో సెవెన్‌హిల్‌్్స ఎక్స్‌ప్రెస్‌ రైలు సిగ్నల్‌ లేకపోవడంతో స్టేషన్‌ ఔటర్‌లో ఆగిపోయింది. వెంటనే దుండగులు బోగీల్లోకి చొరబడి మారణాయుధాలను చూపి ప్రయాణికులను దోచుకున్నారు. వారి నుంచి నగదు, బంగారు నగలు లాక్కున్నారు. ఎంత మొత్తం దోపిడీ జరిగిందో వివరాలు తెలియరాలేదు. ఆరు తులాల బంగారం, నగలు దుండగులు దోచుకున్నట్లు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులతో పాటు సివిల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలించారు. అనంతరం తురకపల్లి స్టేషన్‌ మాస్టర్‌ రైలుకు సిగ్నల్‌ ఇచ్చి పంపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని