Updated : 10 Apr 2022 06:50 IST

ప్రేమ పేరిట నయవంచన: వీడియో తీసి.. మిత్రులకూ ఆ అమ్మాయి లొంగేలా..

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ప్రేమ పేరిట ఓ యువకుడు వంచనకు పాల్పడ్డాడు. ఓ అమ్మాయిని లోబరుచుకుని.. ఆ వివరాలు చరవాణిలో చిత్రించి.. తన మిత్రులకూ ఆమె లొంగేలా చేసిన దారుణ ఘటన ఇదీ. యలహంక శివార్లలో ఓ బాలిక (15)పై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులో ఇద్దరు బాలురూ ఉన్నట్లు గుర్తించారు. ఓ యువకుడు (25) ఆమెను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. మాట్లాడాలంటూ.. ఇటీవల యలహంకలోనే ఓ ఇంటికి ఆమెను తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో ఆ యువకుడి మిత్రుడు చరవాణిలో మొత్తం చిత్రీకరించాడు. మరుసటి రోజు ఆమెకు వీడియో చూపించి.. తన మిత్రుల ‘అవసరాలు’ తీర్చాలంటూ బలవంతం చేశాడు. విధిలేని పరిస్థితిలో ఆ బాలిక కొంత డబ్బు సేకరించి వారికి అందించింది. ఆపై ‘కోరిక’ తీర్చాలంటూ పట్టుపట్టడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. వారం రోజులుగా ఆమె జీవితంతో చెలగాటమాడారు.

గురువారం రాత్రి దయనీయ స్థితిలో ఇంటికి వచ్చిన ఆమెను తల్లిదండ్రులు గుర్తించారు. మంచి మాటలతో వారు బుజ్జగించి అడిగాక.. అసలు విషయం వివరించింది. పెద్దలు వెంటనే స్పందించి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం నుంచి వేగంగా స్పందించిన పోలీసులు శనివారం ఉదయానికి దుండగులందరినీ పట్టుకుని అసలు విషయం వెలుగులోకి తెచ్చారు. బాలికను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అత్యాచార, లైంగిక దౌర్జన్యాల నియంత్రణ చట్టాల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని