Updated : 12 Apr 2022 07:45 IST

Andhra News: ఇంటర్‌ విద్యార్థుల దాడిలో హోంగార్డు మృతి

నంద్యాల నేరవార్తలు, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు, మరో యువకుడు దాడిచేయడంతో ఓ హోంగార్డు మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గుండంపాడు గ్రామానికి చెందిన కుమ్మరి రాజశేఖర్‌ (44) నంద్యాల పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న కేంద్ర గిడ్డంగుల సంస్థలో హోంగార్డుగా విధులు నిర్వహించేవారు. ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు ఇంటర్‌ విద్యార్థులు, మరో యువకుడు మద్యం తాగేందుకు కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించారు. మద్యం తాగి తిరిగి వెళుతున్న సమయంలో హోంగార్డు రాజశేఖర్‌ వారిని ఆపి లోపలికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. దీంతో వారు మమ్మల్నే అడుగుతావా అంటూ ఘర్షణకు దిగారు. మద్యం మత్తులో బలంగా తోసేయడంతో ఆయన తల గేటుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో పడిఉన్న రాజశేఖర్‌ను తోటి హోంగార్డు రామసుబ్బయ్య స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని