Crime News: విదేశీ ఉద్యోగాలకు నకిలీ పత్రాలు.. విజయవాడలో మూలాలు
విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చి యూఎస్ ఎంబసీ అధికారులను మోసం చేసిన ఘటన దేశ రాజధానిలో తాజాగా వెలుగులోకి రాగా.. దాని మూలాలు విజయవాడలో బయటపడటం
యూఎస్ ఎంబసీ అనుమానంతో వెలుగులోకి
విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చి యూఎస్ ఎంబసీ అధికారులను మోసం చేసిన ఘటన దేశ రాజధానిలో తాజాగా వెలుగులోకి రాగా.. దాని మూలాలు విజయవాడలో బయటపడటం కలకలం రేపింది. ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన ఒక అభ్యర్థి ఈ నెల 7న దిల్లీలోని యూఎస్ ఎంబసీలో స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు అపాయింట్మెంట్ లెటర్‌తోపాటు గుంటూరులోని ఓ బ్యాంకు నుంచి రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరైనట్లు పత్రాలను ఎంబసీకి సమర్పించాడు. అవన్నీ తప్పుడువని ఎంబసీ అధికారులు గుర్తించారు. దీనిపై లోతుగా ప్రశ్నించటంతో నకిలీ పత్రాల గుట్టు బయటపడింది. వాటిని విజయవాడలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్‌కు చెందిన ఏజెంట్ కేశవ సమకూర్చినట్లు అతడు తెలియజేశాడు. ఈ పత్రాల కోసం రూ. 26,500 చెల్లించినట్లు చెప్పాడు. దీనిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం మూడు రోజుల క్రితం విజయవాడకు వచ్చినట్లు తెలిసింది. ఇక్కడి కన్సల్టెంట్స్‌లో తనిఖీలు చేసినట్లు సమాచారం. కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్