అధికారులమంటూ వాలంటీర్లకు నకిలీ కాల్స్‌.. లబ్ధిదారుల ఖాతాల్లో నుంచి నగదు కాజేత

అమరావతి నుంచి మాట్లాడుతున్నామంటూ అధికారుల మాదిరిగా వాలంటీర్లకు ఫోన్‌ చేసి పథకాలు అందని లబ్ధిదారుల వివరాలు తీసుకుంటున్న మోసగాళ్లు.. లబ్ధిదారులకు ఫోన్‌ చేస్తున్నారు. వారి ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు

Updated : 15 Apr 2022 08:13 IST

చోడవరం, న్యూస్‌టుడే: అమరావతి నుంచి మాట్లాడుతున్నామంటూ అధికారుల మాదిరిగా వాలంటీర్లకు ఫోన్‌ చేసి పథకాలు అందని లబ్ధిదారుల వివరాలు తీసుకుంటున్న మోసగాళ్లు.. లబ్ధిదారులకు ఫోన్‌ చేస్తున్నారు. వారి ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని ఓటీపీ వస్తుంది చెప్పాలంటూ ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలో చోడవరం-5 వార్డు సచివాలయంలో అమ్మాజీ అనే మహిళ ఖాతా నుంచి రూ.2 వేలు ఇలాగే కొట్టేశారు. అడ్డూరులో ఓ లబ్ధిదారు ఖాతా నుంచి రూ.73 వేలు లాగేశారు. ఇలా ఒకే ఫోన్‌ నంబరు నుంచి చాలామందికి ఫోన్లు వచ్చాయి. ఈ నకిలీ ఫోన్‌కాల్స్‌పై చోడవరం-5 మహిళా పోలీస్‌ బగ్గు శివలక్ష్మి వాలంటీర్లను అప్రమత్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని