యువకుణ్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు..

Published : 16 Apr 2022 05:58 IST

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అశ్వారావుపేట మండలం పేరాయిగూడేనికి చెందిన గంధం గులకరాజు చిట్టీ నగదు కట్టేందుకు తన పెద్ద కుమారుడు రాజేశ్‌(19) బ్యాంకు ఖాతాలో 4 రోజుల క్రితం రూ.15 వేలు వేశారు. కాగా యువకుడు ఆ నగదుతో ఆన్‌లైన్‌ గేమ్‌లో బెట్టింగ్‌ పెట్టి రూ.10 వేలు పోగొట్టుకున్నాడు. తండ్రి నగదు అడుగుతారని భయపడి శుక్రవారం రాత్రి పురుగు మందు తాగాడు.  కుటుంబీకులు బాధితుణ్ని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని