వారానికోసారి వచ్చి బిస్కెట్లు విసిరేస్తూ.. కన్నతల్లిని పదేళ్లు బంధించిన కర్కోటకులు

కన్నతల్లిని ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్లుగా హింసించిన ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా కావేరినగర్‌కు చెందిన జ్ఞానజ్యోతి

Updated : 18 Apr 2022 08:29 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: కన్నతల్లిని ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్లుగా హింసించిన ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా కావేరినగర్‌కు చెందిన జ్ఞానజ్యోతి (62)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు షణ్ముగసుందరన్‌ చెన్నైలో ఇన్‌స్పెక్టర్‌. చిన్న కుమారుడు వెంకటేశన్‌ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. పదేళ్ల కిందటే జ్ఞానజ్యోతి భర్త, కుమార్తె మృతి చెందారు. కుమారులు ఆస్తి గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లిని పట్టించుకోకుండా పదేళ్ల కిందటే ఆమెను ఓ ఇంట్లో బంధించారు. వారానికోసారి వచ్చి బిస్కెట్లు తెచ్చి గేట్‌లోంచి లోపలికి విసిరేసి వెళ్లేవారు. ఆమె పరిస్థితి చూసి స్థానికులే ఆహారం పెట్టేవారు. ఇటీవల ఈ విషయం గుర్తించిన ఓ సామాజిక కార్యకర్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా అధికారులు ఆమెను కాపాడారు. ప్రస్తుతం ఆమె మానసికస్థితి సరిగా లేదు. చికిత్స కోసం తంజావూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షణ్ముగసుందరన్‌, వెంకటేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు