Updated : 23 Apr 2022 07:21 IST

Andhra News: ల్యాప్‌టాప్‌ పేలుడు ఘటనలో గాయపడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

బి.కోడూరు, న్యూస్‌టుడే: ల్యాప్‌టాప్‌ పేలి తీవ్రంగా గాయపడిన వైఎస్‌ఆర్‌ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన సిద్దు సుమలత (22) శుక్రవారం తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మండల పరిషత్తు మాజీ ఉపాధ్యక్షుడు, తెదేపా నాయకుడు సిద్దు వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీనరసమ్మ దంపతుల రెండో కుమార్తె సుమలత బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18న తన ఇంటిలో మంచంపై కూర్చొని విధులు నిర్వహిస్తుండగా ఆమె ఛార్జింగ్‌ పెట్టిన ల్యాప్‌టాప్‌ ఒక్కసారిగా పేలింది. పరుపు, మంచానికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమలత ఉద్యోగంలో చేరి మూడునెలలే అయింది. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని