Published : 26 Apr 2022 10:14 IST

Telangana News: మత్తుకు బానిసైన కన్నకుమారుడిని కడతేర్చిన తల్లిదండ్రులు

కోనరావుపేట, న్యూస్‌టుడే: కుమారుడు మద్యం, మత్తు పదార్థాలకు బానిసై చూపిస్తున్న నిత్య నరకాన్ని భరించలేక కన్న తల్లిదండ్రులే అతన్ని కడతేర్చారు. సంఘటన సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం ధర్మారానికి చెందిన గుర్రం బాలయ్యగౌడ్‌, లావణ్య దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు నిఖిల్‌(23) అయిదేళ్ల కిందట ఉపాధి కోసం ఒమన్‌, మలేసియా దేశాలకు వెళ్లాడు. ఇంటికి తిరిగివచ్చిన అతను రెండేళ్లుగా డ్రైవర్‌ పనిచేస్తూ మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. తండ్రి పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు కౌన్సెలింగ్‌ చేశారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.  సోమవారం మద్యం మత్తులో నిఖిల్‌ తల్లితో గొడవపడగా తండ్రి మందలించాడు. కోపోద్రిక్తుడైన నిఖిల్‌ రోకలితో దాడికి ప్రయత్నించాడు. తండ్రి తప్పించుకునే క్రమంలో అదే రోకలితో కుమారుడిని కొట్టగా అతను గాయపడ్డాడు. తిరిగి దాడి చేస్తాడనే భయంతో తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు వంశీ, అజయ్‌లు కలిసి నిఖిల్‌ మెడకు తాడు చుట్టి హత్య చేశారు. వీఆర్వో నళిని ఫిర్యాదు మేరకు చందుర్తి సీఐ శ్రీలత పర్యవేక్షణలో నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీరాం ప్రేమ్‌దీప్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని