కళ్లకు గంతలు కట్టుకునే ఆట.. ఐస్‌క్రీమ్ బాక్సులో దాక్కుని మృత్యుఒడికి
కళ్లకు గంతలు కట్టుకునే ఆట ఇద్దరు బాలికల ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా మసగె గ్రామంలో బుధవారం విషాదాన్ని నింపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..
మైసూరు, న్యూస్‌టుడే: కళ్లకు గంతలు కట్టుకునే ఆట ఇద్దరు బాలికల ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా మసగె గ్రామంలో బుధవారం విషాదాన్ని నింపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. మృతులను భాగ్య(12), కావ్య(7)గా గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి కళ్లకు గంతలు కట్టుకునే ఆట ఆడుకునే సమయంలో అక్కడే ఉన్న ఐస్‌క్రీమ్ బాక్స్‌లో ఇద్దరు బాలికలు దాక్కున్నారు. అప్పుడే బాక్స్ గడియపడింది. వారిద్దరి కోసం ఇతరులు గాలించినా ఫలితం లేకపోయింది. దాదాపు రెండు గంటల తరువాత ఐస్‌క్రీమ్ బాక్సును తెరవగా అందులో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు