ఆరేళ్ల బాలికపై అత్యాచారం

రాష్ట్రంలో అత్యాచార ఘటనలు ఆగడం లేదు. మొన్న రేపల్లెలో వివాహితపై సామూహిక అత్యాచార ఘోర ఉదంతం మరువక ముందే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎస్సీ కాలనీలో అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Published : 07 May 2022 07:55 IST

నర్సీపట్నంలో అమానుషం 

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అత్యాచార ఘటనలు ఆగడం లేదు. మొన్న రేపల్లెలో వివాహితపై సామూహిక అత్యాచార ఘోర ఉదంతం మరువక ముందే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎస్సీ కాలనీలో అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో తన అక్కతో కలిసి బహిర్భూమికి వచ్చిన ఆ బాలికను అదే కాలనీకి చెందిన గొంది సాయిరామ్‌ కిరణ్‌(20) నోరునొక్కి పక్కకు తీసుకెళ్లిపోయాడు. ఆ బాలిక సోదరి గగ్గోలు పెడుతూ ఇంట్లోకి వెళ్లి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెతుకుతున్నప్పుడు పక్క వీధిలో కిరణ్‌ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతుండటాన్ని గమనించారు. వీరందరినీ చూసి నిందితుడు పారిపోయాడు. బాలికకు రక్తస్రావం జరగడంతో తెల్లవారుజామున 3గంటల సమయంలో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.

దొంగతనం కేసుల్లో నిందితుడే...

విషయం తెలిసిన వెంటనే ఏఎస్పీ విజయ్‌ మణికంఠ రంగంలోకి దిగారు. మూడు పోలీసు బృందాలతో గాలించి గురంధరపాలెం సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. ఐపీసీ 376 (ఏబీ), పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు సాయిపై పట్టణ పోలీసుస్టేషన్‌లో 2018, 2019లో దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌ తెలిపారు. బాలికను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ పరామర్శించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని