Updated : 08 May 2022 06:47 IST

Andhra News: డబ్బు ఇవ్వకపోతే నగ్నచిత్రాలు నెట్‌లో పెట్టేస్తా..

యువతి తండ్రికి గ్రామ సచివాలయ ఉద్యోగి బెదిరింపులు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: అతనో గ్రామ సచివాలయ ఉద్యోగి... ప్రియురాలి నగ్న చిత్రాలను ఆమె తండ్రి ఫోన్‌కు పంపి బెదిరింపులకు దిగాడు... ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని హెచ్చరించాడు. విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఏఎస్పీ పి.అనిల్‌ కుమార్‌ శనివారం వెల్లడించారు. శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి గ్రామ సచివాలయంలో శీరెడ్డి నవీన్‌ ఇంజినీరింగ్‌ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అదే సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినితో రెండేళ్లుగా ప్రేమాయణం సాగించాడు. ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం కావడంతో ఇరు కుటుంబాలూ పెళ్లికి అంగీకరించాయి. అంతలో రెండు నెలల కిందట ఇద్దరి మధ్య మనస్పర్థలొచ్చాయి. ఇల్లు కడుతున్నానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ... నిర్మాణానికి డబ్బు కావాలని నవీన్‌ డిమాండు చేశాడు. డబ్బు ఇవ్వలేమని యువతి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో యువతి నగ్న చిత్రాలను ఆమె తండ్రి ఫోన్‌కు పంపి... వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ నవీన్‌ బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts