Viveka Murder Case: కడప నుంచి వెళ్లిపోండి.. సీబీఐ డ్రైవర్‌కు బెదిరింపులు

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు జరుపుతున్న సీబీఐ సిబ్బందికి కడపలో బెదిరింపుల పర్వం మొదలైంది. కడప నుంచి వెళ్లిపోవాలని, లేదంటే మీ అంతు చూస్తామంటూ నడిరోడ్డుపై జనం మధ్య గుర్తు

Updated : 11 May 2022 07:06 IST

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు జరుపుతున్న సీబీఐ సిబ్బందికి కడపలో బెదిరింపుల పర్వం మొదలైంది. కడప నుంచి వెళ్లిపోవాలని, లేదంటే మీ అంతు చూస్తామంటూ నడిరోడ్డుపై జనం మధ్య గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ అధికారుల వాహన డ్రైవర్‌ వలీ బాషాను హెచ్చరించారు. ఈ మేరకు కడప చిన్నచౌకు పోలీసులకు మంగళవారం సీబీఐ అధికారులు ఫిర్యాదు చేశారు. కడప నుంచి కేంద్ర కారాగారానికి వెళుతున్న సమయంలో కొందరు తమ వాహనాన్ని నిలిపి బెదిరించినట్లు డ్రైవర్‌  వలీ బాషా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు పోలీసులను కలిసి  బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం కేసు నమోదు చేసింది. సీసీ ఫుటేజీలు పరిశీలించేందుకు రంగంలోకి దిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని