ఉప్పు కర్మాగారంలో గోడ కూలి 12 మంది మృతి

గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హల్వద్‌ పారిశ్రామిక ప్రాంతంలోని సాగర్‌ ఉప్పు కర్మాగారంలో బుధవారం గోడ కూలి 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మూడేళ్ల బాలుడితో పాటు అయిదుగురు

Published : 19 May 2022 04:40 IST

గుజరాత్‌లో ఘోర ప్రమాదం

మోర్బి: గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హల్వద్‌ పారిశ్రామిక ప్రాంతంలోని సాగర్‌ ఉప్పు కర్మాగారంలో బుధవారం గోడ కూలి 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మూడేళ్ల బాలుడితో పాటు అయిదుగురు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు కార్మికులను ప్రాణాలతో కాపాడినట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బ్రిజేశ్‌ మీర్జా తెలిపారు. 30 మంది క్షత గాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. గోడ దగ్గర పెట్టిన ఉప్పు బస్తాల ఒత్తిడి కారణంగానే.. గోడ కూలి.. కూలీలపై పడినట్లు తెలుస్తోంది. భోజన విరామ సమయం కావడం వల్ల తక్కువ మంది కార్మికులు ఉన్నారని.. లేదంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదని అధికారులు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ విచారం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని