అధికారులను బెదిరించిన కేసులో ఓఎంసీ డైరెక్టర్‌కు మూడేళ్ల జైలు

అధికారులను బెదిరించిన కేసులో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) ప్రతినిధికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య గురువారం తీర్పు వెల్లడించారు.

Published : 20 May 2022 06:01 IST

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: అధికారులను బెదిరించిన కేసులో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) ప్రతినిధికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య గురువారం తీర్పు వెల్లడించారు. ఓబుళాపురం పరిధిలో ఓఎంసీ నిర్వాహకులు గతంలో అనుమతికి మించి ఇనుప ఖనిజం తరలిస్తున్నారని జిల్లా అటవీశాఖ అధికారి కల్లోల్‌ బిశ్వాస్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లారు. ఆ సమయంలో ఓఎంసీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి తమను అడ్డుకుని, విధులకు ఆటంకం కలిగించారని బిశ్వాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షులను విచారించిన కోర్టు శ్రీనివాసరెడ్డిని దోషిగా నిర్ధారించింది. మూడేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై శ్రీనివాసరెడ్డి పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని