పడమటి కంభంపాడు సర్పంచిపై కేసు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు సర్పంచి లావణ్యపై స్థానిక వాలంటీరు అనూష ఫిర్యాదు మేరకు సోమశిల పోలీసులు ఆదివారం కేసు

Published : 23 May 2022 04:35 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు సర్పంచి లావణ్యపై స్థానిక వాలంటీరు అనూష ఫిర్యాదు మేరకు సోమశిల పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఉపాధి హామీ అక్రమాలు ప్రశ్నించిన సర్పంచి లావణ్యపై స్థానిక వాలంటీరు దాడికి ప్రయత్నించిన సంఘటనలో సోమశిల పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఆదివారం వైకాపా నాయకులతో కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి వాలంటీరు అనూష.. సర్పంచి, మరో ఆరుగురిపై ఫిర్యాదు చేశారు. దళిత మహిళా సర్పంచిపై అక్రమ కేసు దారుణమని ఆత్మకూరు నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు ఎస్‌.శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని