గిరిజన వసతిగృహ వార్డెన్‌పై అధికారి దాడి

పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో వార్డెన్‌పై సూపరింటెండెంట్‌ దాడి చేయడం సంచలనమైంది.

Updated : 25 May 2022 04:26 IST

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో వార్డెన్‌పై సూపరింటెండెంట్‌ దాడి చేయడం సంచలనమైంది. బాధితుడు, హాస్టల్‌ వార్డెన్‌ జి.శ్రీనివాసరావు నుంచి అందిన ఫిర్యాదు మేరకు సూపరింటెండెంట్‌ చంద్రారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కులం పేరుతో దుర్భాషలాడుతూ తనపై సూపరింటెండెంట్‌ దాడికి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. అందరూ చూస్తుండగా కింద పడేసి వీపుపై కూర్చొని తీవ్రంగా కొట్టారని వివరించారు. 22 ఏళ్లుగా నాలుగో తరగతి ఉద్యోగిగా ఉన్న తాను పదోన్నతివ్వాలని కోరుతూ వస్తున్నానని, న్యాయం చేయాలని సూపరింటెండెంట్‌కు విన్నవించానని, పదోన్నతి సాధ్యం కాదని ఆయన పేర్కొనడంతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లానని శ్రీనివాసరావు తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తావా? అంటూ సమావేశంలో చంద్రారావు దాడి చేసినట్లు వార్డెన్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని