తమిళనాడులో అక్రమ రేషన్‌ బియ్యం స్వాధీనం

తమిళనాడులో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని దాచిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా బర్గూర్‌లోని ఓ ఇంట్లో రేషన్‌ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు పౌర సరఫరాల నేర పరిశోధన విభాగం అధికారులకు సమాచారం అందింది.

Updated : 25 May 2022 04:27 IST

స్టాలిన్‌కు చంద్రబాబు రాసిన లేఖతో అధికారుల్లో కదలిక 

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తమిళనాడులో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని దాచిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా బర్గూర్‌లోని ఓ ఇంట్లో రేషన్‌ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు పౌర సరఫరాల నేర పరిశోధన విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో తిరుమలైనగర్‌కు చెందిన సుబ్రమణియన్‌ ఇంట్లో మంగళవారం తనిఖీలు చేపట్టారు. 12 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీన పరచుకుని, సుబ్రమణియన్‌ను అరెస్టు చేశారు. తమిళనాడు నుంచి రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించడాన్ని అడ్డుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు లేఖ రాసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని