కాళేశ్వరం 9వ ప్యాకేజీ సొరంగంలో ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల 9వ ప్యాకేజీ సొరంగంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

Published : 25 May 2022 04:26 IST

మట్టిపెళ్లలు పడి ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

కోనరావుపేట, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల 9వ ప్యాకేజీ సొరంగంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్కపేట మూడు టీఎంసీల రిజర్వాయర్‌కు నీటిని తరలించడానికి మధ్యమానేరు వరకు 12.03 కిలోమీటర్ల పొడవైన సొరంగానికి లైనింగ్‌ పనులు చేపడుతున్నారు. మర్తన్‌పేట శివారులోని అడిట్‌-2 సొరంగంలో మిగిలిన కిలోమీటరు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది కురిసిన భారీవర్షాలకు సొరంగం పైకప్పు వదులుగా మారడంతో మట్టిపెళ్లలు పడి లోపల లైనింగ్‌ పనులు చేస్తున్న ఝార్ఖండ్‌కు చెందిన యేగేందర్‌ మోహతా(24) అక్కడికక్కడే మృతి చెందాడు. కార్మికులు ఉమేశ్‌కుమార్‌, అవెల్‌ తోప్రా తీవ్రంగా గాయపడగా కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యేగేందర్‌ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ శ్రీరాం ప్రేమ్‌దీప్‌ పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని