భైంసా తహసీల్దారు ఇంట్లో అనిశా సోదాలు

నిర్మల్‌ జిల్లా భైంసా తహసీల్దారు ఎర్ర నరేందర్‌ ఇంటిలో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిర్మల్‌లోని ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లో తనిఖీలు

Published : 26 May 2022 05:05 IST

భైంసా, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా భైంసా తహసీల్దారు ఎర్ర నరేందర్‌ ఇంటిలో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిర్మల్‌లోని ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. నరేందర్‌ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించి సోదాలు చేపట్టగా.. రూ.1,16,28,314 విలువైన చర, స్థిరాస్తులు, రూ. 1,32,096 నగదు లభించింది. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయన్ను అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచినట్లు అధికారులు  తెలిపారు. ఆయన గతేడాది ఖానాపూర్‌  తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలో ఒక గ్రామ రెవెన్యూ అధికారిపై అవినీతి కేసు నమోదైంది. ఆ కేసులో నరేందర్‌ ప్రమేయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని