డ్రైవింగ్‌ రాకపోయినా బరాత్‌లో కారు నడిపిన పెళ్లికొడుకు.. డ్యాన్స్‌ చేస్తున్నవారిపై దూసుకెళ్లి..

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒక బాలుడు మరణించాడు. నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..

Updated : 27 May 2022 07:45 IST

బాలుడి మృతి.. పలువురికి గాయాలు

చండూరు, న్యూస్‌టుడే: పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒక బాలుడు మరణించాడు. నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గట్టుప్పలకు చెందిన మల్లేశ్‌ వివాహం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో బుధవారం జరిగింది. అదే రోజు రాత్రి వధువుతో కలిసి స్వగ్రామానికి కారులో వచ్చారు. డీజే పాటలతో ఇంటివరకు బరాత్‌ ఏర్పాటుచేశారు. వరుడి ఇల్లు కొద్ది దూరం ఉండగా వధువు, వరుడు కారులో నుంచి దిగి బంధువులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. తర్వాత తిరిగి కారులోకి వచ్చారు. ఆ సమయంలో కారు డ్రైవర్‌ దిగి పక్కన ఉండటంతో పెళ్లి కొడుకు మల్లేశ్‌ డ్రైవర్‌ సీట్లో కూర్చున్నారు. డ్రైవింగ్‌ రాకపోయినా నడిపే ప్రయత్నం చేయడంతో కారు ఒక్కసారిగా ఎదురుగా డ్యాన్స్‌ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. డీజే బాక్సులున్న ట్రాక్టర్‌నూ ఢీకొంది. ఈ ప్రమాదంలో దుబ్బాక సాయిచరణ్‌(13) అనే బాలుడు మృత్యువాత పడ్డారు. పెళ్లి కొడుకు సహా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లికొడుకు మల్లేశ్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై నవీన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని