వడ్డీవ్యాపారి వేధింపులతో యువకుడి ఆత్మహత్య

వడ్డీ వ్యాపారి వేధింపుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా అన్నారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మార్క ప్రశాంత్‌ గౌడ్‌(26)కు రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన

Published : 28 May 2022 05:48 IST

మానకొండూర్‌, న్యూస్‌టుడే: వడ్డీ వ్యాపారి వేధింపుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా అన్నారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మార్క ప్రశాంత్‌ గౌడ్‌(26)కు రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన అనన్యతో ఆర్నెల్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భిణి. కరీంనగర్‌లోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో ప్రశాంత్‌ పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి రామాంజనేయులు వద్ద కొంత అప్పు తీసుకున్నాడు. మొత్తం రూ.20 లక్షలైందని చెప్పగా అందులో కొంత చెల్లించాడు. మిగతాది ఇవ్వాలని వడ్డీ వ్యాపారి వేధిస్తున్నాడు. దీంతో గురువారం రాత్రి ప్రశాంత్‌ పురుగుల మందు తాగారు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా శుక్రవారం మరణించారు. మృతుని వద్ద నాన్న, అమ్మ, సోదరుని పేరిట రాసిన ఓ లేఖ లభించింది. వివాహం చేసుకొని అనన్యకు అన్యాయం చేశానని, సారీ అనన్య అంటూ లేఖలో ఉంది. కాగా జమ్మికుంట-మానకొండూర్‌ రహదారిపై బాధిత కుటుంబీకులు, బంధువులు, గ్రామస్థులు ధర్నా చేపట్టారు. బాధితులకు న్యాయం చేస్తానని సీఐ క్రిష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని