తండ్రి దశదిన కర్మకు డబ్బులు లేవని తనయుడి ఆత్మహత్య

తండ్రి దశదినకర్మ నిర్వహణకు డబ్బులు లేవనే మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. అద్రాస్‌పల్లికి చెందిన గ్యార నర్సింహ(32)

Updated : 29 May 2022 05:20 IST

శామీర్‌పేట, న్యూస్‌టుడే: తండ్రి దశదినకర్మ నిర్వహణకు డబ్బులు లేవనే మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. అద్రాస్‌పల్లికి చెందిన గ్యార నర్సింహ(32) లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. ఆయన పని చేసే లారీకి ఇసుక గిరాకీ సక్రమంగా దొరకడం లేదు.  ఈ నెల 21న నర్సింహ తండ్రి యాదగిరి అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి దశదిన కర్మకు డబ్బులు చేతికందలేదు. మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. 10 రోజుల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని