Telangana News: కారులో చిక్కుకుపోయి బాలిక దుర్మరణం
కందనూలు, న్యూస్‌టుడే: కారులో చిక్కుకొని బాలిక మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ నాగనూల్ బీసీ కాలనీకి చెందిన అంజమ్మ పట్టణంలో చెత్త కాగితాలు సేకరించడంతో పాటు ఇనుప సామాను దుకాణంలో కూలి పని చేస్తూ ఉపాధి పొందుతోంది. ఆమె కుమార్తె సుగుణ (9) పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఈ నెల 2న (గురువారం) మధ్యాహ్నం తల్లి కూలి పనికి వెళ్లాక చిన్నారి మధురానగర్ కాలనీలో చెత్తను సేకరించడానికి వెళ్లింది. అదే కాలనీలో నివాసముంటున్న సయ్యద్ ఇమ్రాన్ పాషా తన కారు ఇంటి వెనుక ఖాళీ స్థలంలో నిలిపారు. అటుగా వెళ్లిన అమ్మాయి కారు డోరును పట్టుకోగా అది సులువుగా తెరుచుకుంది. అందులోకి వెళ్లి డోరు వేసుకొని చిక్కుకుపోయింది. రాత్రి అయినా బాలిక ఇంటికి రాకపోవడంతో.. తల్లి తెలిసిన ఇళ్లలో వాకబు చేసి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు రాత్రి కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కారులోని మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో శనివారం పోలీసులు సంఘటనా స్థలానికి సమీపంలో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
-
India News
Tattoos: టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్!
-
Politics News
Arvind Kejriwal: భాజపాది దురహంకారం.. కేజ్రీవాల్ ఫైర్!
-
General News
Telangana News: రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలకు పరిపాలన అనుమతి
-
World News
Rishi Sunak: ప్రధాని పదవికి నేనే బెస్ట్..!
-
General News
Antibiotics: యాంటీ బయోటిక్స్ ఇష్టం వచ్చినట్టు వాడొద్దు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Alibaba: 10 వేల మంది ఉద్యోగులకు అలీబాబా గుడ్‌బై.. 2016 తర్వాత తొలిసారి!
- Tattoos: టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్!
- Rishi Sunak: ప్రధాని పదవికి నేనే బెస్ట్..!
- CWG 2022: రవి దహియా, వినేష్ పొగట్, నవీన్ పసిడి పట్టు.. రెజ్లింగ్‌లో స్వర్ణాల పంట
- IT Raids: సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. రూ.200కోట్ల ‘నల్లధనం’ గుర్తింపు
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- Arvind Kejriwal: భాజపాది దురహంకారం.. కేజ్రీవాల్ ఫైర్!
- INDw vs ENGw : క్రికెట్లో పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ఇండియా
- Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలో జగ్దీప్ ధన్‌ఖడ్ విజయం