Khammam: కారణమేంటో తెలీదు.. వారంలో ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారుల కన్నుమూత

కంటికిరెప్పలా కాపాడుకుంటున్న పిల్లల్ని తీవ్ర అనారోగ్యం చుట్టుముట్టింది. ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు ఆవేదనలోకి కూరుకుపోయారు. ఇంతలోనే ఒక కుమారుడు

Updated : 13 Jun 2022 07:24 IST

అనారోగ్యానికి కారణం ఏంటో తెలియని వైచిత్రి

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: కంటికిరెప్పలా కాపాడుకుంటున్న పిల్లల్ని తీవ్ర అనారోగ్యం చుట్టుముట్టింది. ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు ఆవేదనలోకి కూరుకుపోయారు. ఇంతలోనే ఒక కుమారుడు ప్రాణాలొదిలాడు. ఎలాగైనా ఇంకో కుమారుడినైనా బతికించుకుందాం అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. అతడు కూడా మరణించడంతో ఆ కుటుంబం పీకలోతు బాధల్లో మునిగిపోయింది. ఇద్దరు చిన్నారులు మరణించినా దానికి కారణం తెలియకపోవడం మరింత దురదృష్టకరం. ఈ హృదయవిదారక సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో చోటు చేసుకొంది.

రోజుల వ్యవధిలోనే కంటిపాపలు కనుమరుగవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పావురాల లీలాప్రసాద్‌, మాధవి దంపతుల పెద్ద కుమారుడు కార్తీక్‌(8) ఈ నెల 6న, చిన్న కుమారుడు ఆదిరామ్‌(6) 11న మృత్యువాత పడ్డారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. గత వారం చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కార్తీక్‌ ఇంటి వద్దే మృతి చెందగా వడదెబ్బ తగిలిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భావించారు. ఆదిరామ్‌ పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్‌ రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతికి కారణాలు తెలియరాలేదు. ఆదిరామ్‌ శరీర భాగాన్ని పరీక్షల కోసం కేరళ పంపినట్లు వైద్యులు తెలిపారని గ్రామస్థులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని