పొక్లెయిన్‌కు మావోయిస్టుల నిప్పు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గోరుకొండ అటవీ ప్రాంతంలో ఓ పొక్లెయిన్‌ను మావోయిస్టు మిలీషియా సభ్యులు తగులబెట్టారు. మరో పొక్లెయిన్‌ను అపహరించుకుపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 21 Jun 2022 04:38 IST

మరోటి అపహరణ

చర్ల, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గోరుకొండ అటవీ ప్రాంతంలో ఓ పొక్లెయిన్‌ను మావోయిస్టు మిలీషియా సభ్యులు తగులబెట్టారు. మరో పొక్లెయిన్‌ను అపహరించుకుపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోరుకొండ అటవీ ప్రాంతంలో గతకొన్ని రోజులుగా కంపా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆదివారం ఆ ప్రాంతానికి చేరుకున్న మావోయిస్టు మిలీషియా సభ్యులు పనులకు వినియోగిస్తున్న పొక్లెయిన్‌కు నిప్పంటించడంతో కొంతమేరకు కాలిపోయింది. మరో పొక్లెయిన్‌ను, ద్విచక్ర వాహనాన్ని, ఆ ప్రాంతంలో భోజనం చేస్తున్న కొందరు యువకుల సెల్‌ఫోన్లను కూడా తమ వెంట తీసుకెళ్లారు. స్థానిక సీఐ అశోక్‌, అటవీ క్షేత్రాధికారి ఉపేందర్‌ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టు మిలీషియా బృందం ఈ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.

‘అగ్నిపథ్‌తో యువతను మోసగిస్తున్న కేంద్రం’

దేశంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకం పేరుతో యువతరాన్ని మోసగిస్తోందని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ సోమవారం ఓ లేఖలో విమర్శించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిరుద్యోగ యువతపై జరిగిన కాల్పుల ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం ఈ పథకాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్‌ కుటుంబానికి కేంద్రం రూ.2 కోట్లు, గాయపడిన వారికి రూ.కోటి పరిహారం చెల్లించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని