Khammam: బాబాయి కొడుకులపై పెట్రోల్ పోసి నిప్పు.. మంటల్లో తానూ కాలి..
అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా అభంశుభం ఎరుగని ఇద్దరు బాలుర ప్రాణాల మీదకు తెచ్చింది. చిన్నాన్నపై పగ పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పథకం ప్రకారం ఇద్దరు తమ్ముళ్లపై పెట్రోల్
ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా అభంశుభం ఎరుగని ఇద్దరు బాలుర ప్రాణాల మీదకు తెచ్చింది. చిన్నాన్నపై పగ పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పథకం ప్రకారం ఇద్దరు తమ్ముళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనపైనా పెట్రోల్ పడటంతో అవే మంటల్లో చిక్కుకున్నాడు. ఈ ఘటన ఖమ్మంలో గురువారం సాయంత్రం జరిగింది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మంలోని మేదరబజార్కు చెందిన కోన చిలకారావు, కోన శ్రీనివాసరావు అన్నదమ్ములు. శ్రీనివాసరావు డెకరేషన్ కూలి పనులు చేస్తూ భార్య భవాని, కుమారులు భార్గవ్(15), వీరేందర్(12)లతో కలిసి జీవిస్తున్నాడు. పెద్దకుమారుడు పదో తరగతి, చిన్నకుమారుడు 7వ తరగతి చదువుతున్నారు. రెండేళ్లుగా అన్నదమ్ముల కుటుంబాల మధ్య స్థల వివాదం ఉంది. కేసు కూడా నమోదైంది. దీంతో పగతో ఉన్న చిలకారావు కుమారుడు ఉమారాజశేఖర్ తన బాబాయి ఇంట్లో లేడని గమనించి సాయంత్రం 6.30 గంటల సమయంలో క్యానులో పెట్రోల్ పట్టుకుని వెళ్లాడు. ఇంటి బయటి నుంచి పెట్రోల్ పోసుకుంటూ వెళ్లి పిల్లలున్న గది నిండా చల్లాడు. ఇది గమనించిన చిన్నారులు పక్క ఇంట్లోనే ఉన్న పెద్దమ్మకు విషయాన్ని చెప్పేందుకు వెళ్లేలోగా నిప్పంటించాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌పైనా పెట్రోల్ పడటంతో అతనికీ మంటలు అంటుకున్నాయి.
అన్నదమ్ముల ఆర్తనాదాలు
చిన్నారులు మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేశారు. దీన్ని గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపకదళం సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురి కాళ్లు, చేతులు, ముఖాలు తీవ్రంగా కాలిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం