క్రికెట్‌ శిక్షణ పొందుతున్న 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో యూత్‌ క్రికెట్‌ క్లబ్‌లో క్రికెట్‌ శిక్షణ పొందుతున్న 13ఏళ్ల బాలికపై కోచ్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక, తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు

Published : 24 Jun 2022 05:22 IST

కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు.. పోక్సో కేసు నమోదు

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో యూత్‌ క్రికెట్‌ క్లబ్‌లో క్రికెట్‌ శిక్షణ పొందుతున్న 13ఏళ్ల బాలికపై కోచ్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక, తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు యూత్‌ క్రికెట్‌ క్లబ్‌, కడప క్రికెట్‌ అసోసియేషన్లు విచారణ జరిపి ఒక కోచ్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేయడంతోపాటు మరో కోచ్‌ను విధులకు రావొద్దని ఆదేశాలు జారీ చేశాయి. దీనిపై కడప క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు, ప్రొద్దుటూరు యూత్‌ క్రికెట్‌ క్లబ్‌ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డిని ‘న్యూస్‌టుడే’ గురువారం సంప్రదించగా.. ఇద్దరు కోచ్‌ల్లో ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని బాలిక, ఆమె తల్లిదండ్రులు పది రోజుల క్రితం తమ దృష్టికి తెచ్చారని, తర్వాత తాము విచారణ చేపట్టామన్నారు. బాలిక ఫిర్యాదు చేసిన కోచ్‌ను సస్పెండు చేశామని తెలిపారు. రెండో కోచ్‌ను నెట్స్‌కు రావొద్దని చెప్పామన్నారు. కాగా.. వేధింపుల ఘటనలో క్రికెట్‌ కోచ్‌ అహ్మద్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసినట్లు ప్రొద్దుటూరు మూడోఠాణా ఎస్‌ఐ రాజగోపాల్‌ తెలిపారు. 13 ఏళ్ల బాలిక క్రికెట్‌ కోచ్‌ అహ్మద్‌ వద్ద శిక్షణ తీసుకుంటోందని, ఈ క్రమంలో అహ్మద్‌ తనను ప్రేమించాలంటూ బాలికను నెల రోజుల నుంచి వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని