Andhra News: నాటుసారా అమ్ముతూ గ్రామ వాలంటీరు అరెస్టు

శ్రీకాకుళం జిల్లా మందస మండలం మేఘమాల గ్రామానికి చెందిన సవర రాజారావు, సవర విజయ్‌లు నాటుసారా అమ్ముతుండగా ఎస్‌ఈబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. వీరిలో రాజారావు గ్రామ వాలంటీరుగా, మందస

Updated : 24 Jun 2022 08:45 IST

మందస, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా మందస మండలం మేఘమాల గ్రామానికి చెందిన సవర రాజారావు, సవర విజయ్‌లు నాటుసారా అమ్ముతుండగా ఎస్‌ఈబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. వీరిలో రాజారావు గ్రామ వాలంటీరుగా, మందస పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక పోలీసుగా పనిచేస్తుండటం గమనార్హం. సోంపేట ఎస్‌ఈబీ సీఐ టీవీఏ నాయుడు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. మరో ఇద్దరు సవర డొంబురు, సవర దయానిధి పట్టుబడినా తమపై దాడికి దిగి పరారయ్యారని సీఐ తెలిపారు. రాజారావు, విజయ్‌ని అరెస్టు చేసి రిమాండుకు పంపామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని