సికింద్రాబాద్‌ విధ్వంసం కేసులో పోలీసుల అదుపులో మరో ఏడుగురు

అగ్నిపథ్‌ ప్రకటనకు నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జూన్‌ 17న జరిగిన విధ్వంసం కేసులో సూత్రధారిగా వ్యవహరించిన ఆవుల సుబ్బారావు ఆరెస్టు ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Updated : 25 Jun 2022 07:41 IST

సుబ్బారావు అరెస్టు ఆలస్యం?

ఈనాడు, హైదరాబాద్‌: అగ్నిపథ్‌ ప్రకటనకు నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జూన్‌ 17న జరిగిన విధ్వంసం కేసులో సూత్రధారిగా వ్యవహరించిన ఆవుల సుబ్బారావు ఆరెస్టు ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ ఏడుగురు సుబ్బారావు అనుచరులేనని రైల్వే పోలీసులు ఆధారాలు సేకరించారు. అంతకుమునుపు సుబ్బారావుతో సహా ఎనిమిది మందిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే పోలీస్‌ ఠాణాకు తరలించారు. తాజాగా ఆదుపులోకి తీసుకున్న వారిని కూడా విచారించిన తర్వాత సుబ్బారావును న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సుబ్బారావు నేరం చేశాడన్న ఆధారాల్లేవు.. న్యాయవాది: సికింద్రాబాద్‌ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు ప్రత్యక్షంగా పాల్గొన్నాడనే ఆధారాల్లేవని ఆయన తరఫు న్యాయవాది రైల్వేస్టేషన్‌ వద్ద విలేకరులతో అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలనే ఆయన ఆర్మీ అభ్యర్థులకు సూచించాడని తెలిపారు. 17వతేదీ సుబ్బారావు సికింద్రాబాద్‌లో లేడని, బోడుప్పల్‌లోని సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఉన్నాడన్నారు.ఆయన నేరానికి పాల్పడినట్టు ఆధారాలు లేకపోవడం వల్లనే పోలీసులు ఇన్ని రోజులు అదుపులో ఉంచుకున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని