పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్ ఆత్మహత్య
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్ కె.మునికుమార్(52) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వైయస్ఆర్ జిల్లా కడప నగరంలోని రాయచోటి రైల్వేగేటు సమీపంలో శనివారం ఈ ఘటన జరిగింది.
పని ఒత్తిడే కారణమా?
కడప నేరవార్తలు, పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్ కె.మునికుమార్(52) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వైయస్ఆర్ జిల్లా కడప నగరంలోని రాయచోటి రైల్వేగేటు సమీపంలో శనివారం ఈ ఘటన జరిగింది. కడప రైల్వే సీఐ మహమ్మద్ బాబా తెలిపిన వివరాల మేరకు.. కడప ప్రకాష్‌నగర్‌కు చెందిన కె.మునికుమార్ అక్కడి నగరపాలక కార్యాలయంలో సూపరింటెండెంటుగా పనిచేస్తూ డిప్యూటేషన్‌పై మూడు నెలల కిందట పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్‌గా వెళ్లారు. వారాంతపు సెలవుల్లో ఇంటికి వచ్చేవారు. పుట్టపర్తికి వెళ్లిన తరువాత పని ఒత్తిడి ఎక్కువైందని, తిరిగి కడపకు బదిలీ పెట్టుకోవాలని భార్య, తోటి స్నేహితులకు చెప్పేవారు. శుక్రవారం, శనివారం సెలవు పెట్టి కడపకు వచ్చారు. గురువారం ఇంటికి వచ్చే ముందు తన సిమ్‌కార్డును అధికారులకు ఇచ్చి వచ్చారని తెలిసింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్నారు. తరువాత ఎవరికీ చెప్పకుండా ద్విచక్రవాహనంపై రాయచోటి రైల్వేగేటు వద్దకు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వేస్టేషన్ మేనేజరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. పని ఒత్తిడేనా, మరే ఇతర కారణాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పని ఒత్తిడితో పాటు, అమ్మకు ఆరోగ్యం బాగలేదని, కడప కార్పొరేషన్‌కు తిరిగి సూపరింటెండెంట్‌గా బదిలీ చేయాలని మునికుమార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించానని, పది రోజుల్లో కడపకు వెళ్తానని చెప్పేవారని పుట్టపర్తి నగర పంచాయతీలోని తోటి ఉద్యోగులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు